ధనవంతులు, మందీ మార్బలం కలిగిన బలవంతులూ, రాజకీయ అధికారంతో వ్యవస్థను తమకు అనుకూలంగా మలుచుకోగల ‘గుణ’ వంతులూ, వారి సమస్యలకు పరిష్కారాలూ, వారి సంపాదనలకు వెసులుబాట్లూ, వారి నేరాలనుండి బయటపడే సులభ మార్గాలూ సూచించేందుకేనా న్యాయవ్యవస్థ ఉన్నది? చచ్చిపోయి ఎక్కడున్నాడో కాని, ప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథశాస్ర్తీ ‘దేశంలో పూట గటవని వానికి కోర్టు ఫీజులు, న్యాయవాది ఖర్చులు, పెద్ద పట్టణాలకు దారి ఖర్చులు పెట్టుకుని వాయిదాలకు హాజరై కావాల్సిన ‘న్యాయాన్ని’ పొందవచ్చని సూచిస్తుందండీ చట్టం...’’! అంటాడు తన రచనల్లో వొకచోట! కోర్టుల చుట్టూ తిరగలేక, ప్లీడరు బాబులను పోషించలేక, ‘రిమాండు ఖైదీ’గా పడుండలేక ‘వొప్పేసుకుంటాను బాబు.. నేరం వొప్పేసుకుంటాను బాబు’అంటుందో పాత్ర! నేరం వొప్పుకుని, జైలుశిక్ష పడితే, తొందరగా బయటకన్నా రావొచ్చని ఆ పాత్ర తాపత్రయం! మహా రచయిత బెర్నార్డ్‌షా అన్నట్లుగా ‘్ధనవంతులు చట్టాన్ని పరిపాలిస్తారు.. చట్టం పేదవారిని పరిపాలిస్తుంది’!!
మన న్యాయ వ్యవస్థ కలవారికి ‘లీగల్ సేవా’ కేంద్రంగా మారిందన్నది స్పష్టంగా కనిపించే వాస్తవం. ఇందులో న్యాయమూర్తుల ప్రమేయం ఏమీలేకపోవొచ్చును. వారిలో అధిక శాతం నీతికీ, న్యాయానికీ కట్టుబడి వుంటున్నమాట వాస్తవమే. వారిలో కొద్దిశాతం సాధారణ పౌరుల్లా అవలక్షణాలకు గురవుతున్నా న్యాయవ్యవస్థ పైన గౌరవం పడిపోనీకుండా అధిక శాతం న్యాయమూర్తులూ, న్యాయవాదులూ కృషిచేస్తున్నమాటా నిజమే. రాజకీయ, ప్రభుత్వ వర్గాల తీవ్ర వైఫల్యాలనుండి దేశాన్ని అనేకమార్లు న్యాయ వ్యవస్థ రక్షించిన మాటా వాస్తవం. సరిగ్గా రుూ రాజకీయ వైఫల్యాలే న్యాయవ్యవస్థను ‘కలవారి’కార్యక్రమాల అనుకూల సాధనంగా మలిచేయి. ప్రభుత్వమూ రాజకీయ నాయకత్వమూ, ఏ పార్టీ క్రింద వున్నా, ఏ పేరుతోవున్నా అధిక లాభార్జనపరులూ, ధనవంతులూ, పెట్టుబడిదారులూ, పారిశ్రామికవేత్తలూ, బాగా గడించిన కళాకారులూ, భూస్వామ్య రైతులూ, నగరాల్లోని మాఫియా నాయకులూ, రూపుమార్చిన వారి తాబేదారులు మాత్రమే ప్రజాప్రతినిధులై ప్రభుత్వాలు స్థాపిస్తున్నందున క్రింది, అట్టడుగు వర్గాలకు ‘దేశపాలనా, ప్రజాస్వామ్య వ్యవస్థలతో’ ఏమీ సంబంధం లేకుండా పోయింది. వాటిలో అతి ముఖ్యమైన అంగమైన ‘‘న్యాయ వ్యవస్థ’’ కేవలం తమను శిక్షించేందుకు నెలకొన్న సంస్థగా మాత్రమే వారికి తెలుసు.
సివిల్ కేసులన్నీ మధ్యతరగతి, ఉన్నత తరగతి, పెట్టుబడి- పారిశ్రామిక వర్గాలకు చెందినవేనన్నది విదితమే. క్రిమినల్ కేసులన్నీ బడుగుజీవులవేనన్నదీ తెలిసిందే. నేరాలు ఉన్నత వర్గాలకు సంబంధించినవే అయినా, సూత్రధారులు వారే అయినా, పాత్రధారులు, శిక్షాపాత్రులు సాధారణ మానవులుగా వుండటం ఎరిగిన విషయమే. వెరసి న్యాయవ్యవస్థ ‘సివిల్’, క్రిమినల్ కోర్టులుగా విభజించబడింది. సివిల్ కేసుల్లోని ప్రత్యర్థులు అధిక భాగం ఒకే తరగతికి చెందినవారు అయి వుండటమూ జరుగుతుంది. ఎవరికి ‘న్యాయం’జరిగినా పెద్దగా అన్యాయం ఎవరికీ జరగదు. పేదవాళ్ళకు ‘సివిల్’ కేసుల్లో పాత్ర శూన్యమేకాదని పొరపాటున కోర్టులకు వెళ్ళాడో ‘కోర్టుకెక్కినవాడూ, కాటికి వెళ్ళినవాడూ సమానమన్న ‘‘నానుడి నిజమవుతుంటుంది’’. క్రిమినల్ కేసుల్లో మాత్రం న్యాయం ‘త్వరగా’ నిర్ణయించబడి, అమలుచేయబడుతుంది. శిక్షపడినవాడు యావజ్జీవ ఖైదు అయినా, మరణశిక్ష అయినా, అయిదూ -పదేళ్ళ కఠిన కారాగారమైనా అప్పీళ్ళకు వెళ్ళే స్తోమత లేక ‘‘తల వంచి’’ న్యాయమూర్తికి నమస్కరించి, చేతులు చాచి పోలీసులకు అప్పగించటం తప్ప..చేసేదేమీ ఉండదు! ఒకవేళ ఉన్నత, బలమైనవర్గ సభ్యులూ, వారి బిడ్డలూ నేరాల్లో యిరుక్కుంటే ‘న్యాయా న్ని’ అమలుచేయకుండా అడ్డుకుంటున్నారు. ‘ప్రత్యూష’ హత్య కేసులోని ముద్దాయిలు గాని, ఆయేషా మరణంలోని అభియోగ ముద్దాయిలు గాని ‘‘సాధారణ’’ కుటుంబాలవారు కాకపోవటంచేత న్యాయవ్యవస్థ ‘‘పనిచేయలేకపోయిన’’ పరిస్థితి తలెత్తింది. ప్రత్యూష హంతకులను కనీసం శిక్షించగలిగినా, ఆయేషా హత్య కేసు ఎలా జరిగిందో, ఎవరికీ తెలియనట్లు, హంతకులు కాలాతీత విఖ్యాతులైనట్లూ చెబుతున్నారు. తాడూబొంగరం లేనివారిని చూపించి ‘‘నేరాన్ని’’ రుజువుపరుస్తున్నారు. నేరారోపణ, రుజువు పర్వాల్లో పాత్ర కల్గిన పోలీసులు ‘‘పెద్దవారికి’’ అనుకూలంగా వ్యవహరించటంవలన, న్యాయవ్యవస్థ ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తోంది. నేరం ‘‘మరీ పెద్దవారికి’’ సంబంధించినదయితే గాలిలో దీపం పెట్టి గంగానమ్మను రక్షించమంటూ వేడుకుంటున్నారు.
న్యాయ వ్యవస్థ కోప్పడినా, శిక్షించినా తక్షణం బయటపడగల ‘బెయిలు’వ్యవస్థ నెలకొని వుంది. ‘ఏంటిసిపేటరీ’ బెయిలూ, ప్రత్యేక బెయిలూ, అనారోగ్య బెయిలూ, అత్యవసర కారణాల బెయిలూ అనే వివిధ ‘‘స్వేచ్ఛా ప్రవేశ మార్గాలు’’ ఉన్నత నేరస్తులకు లభిస్తుంటాయి. కోట్లాది సామాన్యులకు యివి ఏమిటో తెలిసే అవకాశమే లేదు. కోర్టుల్లో ఓడినా, గెలిచినా కలవారికి ఏ ప్రమాదమూ లేదు!
కోటానుకోట్లు కైంకర్యం చేసిన ప్రసిద్ధులూ, పెద్దలూ అప్పీళ్ళమీద అప్పీళ్ళు చెయ్యటమే కాకుండా ‘‘ఈ జడ్జీ నాకు నచ్చటంలేదు. రుూ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ నాకు గిట్టటంలేదు. ఈ హైకోర్టు నాకిష్టంలేదు. సుప్రీంకోర్టులో ‘వీరిద్దరు’న్యాయమూర్తులున్న బెంచీని తప్పించి మరో బెంచీకి మార్చవలసినది.. వంటి కోర్కెలను డిమాండ్ చెయ్యటమా!! ‘నాట్ బిఫోర్’ అనే వంకర సూత్రం ఏ పెద్దవారిని, ఏ గొప్ప వారిని రక్షించేందుకు పెట్టుకున్నట్లు? ఈ జడ్జి నాకు నచ్చలేదని ఒకరూ, ఆ హైకోర్టులో నాకు న్యాయం జరగదని ఒకరూ, ఆ ప్రభుత్వం ఉండగా అక్కడ విచారణకు అంగీకరించలేనని ఒకరూ, సుప్రీంకోర్టులో నాకోసం ప్రత్యేక విచారణ జరపవలసిందని ఒకరూ కోరుతున్నారంటే భారతీయ న్యాయవ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నట్లు? గత మెంతో ఘనకీర్తి కలిగి తన ప్రత్యేకతను కాపాడుకున్న వ్యవస్థ నేటికి కలవారి క్రీడాప్రాంగణంగా మారుతుంటే ఎవరూ పట్టించుకోవటం లేదు! నెలల తరబడి విచారణలు, డజన్లకొలదీ అప్పీళ్ళు, న్యాయమూర్తులపై సవాళ్ళు, సీ.బీ.ఐ, ఏ.సీ.బీ., ఇ.డీ., ఐ.డీ. వంటి నేర పరిశోధక సంస్థలపైననే తిరుగుబాట్లు జరుగుతుంటే, న్యాయవ్యవస్థ మూలస్తంభాలను విరగ్గొట్టే ప్రయత్నాలు జరుగుతుంటే చట్టసభలూ, ప్రభుత్వాలూ కిమ్మనటం లేదు. ‘‘నాట్ బిఫోర్’’వంటి సంప్రదాయాలు తమ అస్తిత్వానే్న ప్రశ్నిస్తున్నా న్యాయవ్యవస్థ కిమ్మనటంలేదు. అది తమ ఔన్నత్యాన్నీ, న్యాయం యొక్క అగ్నితుల్యశీలతనూ, ప్రజాస్వామ్య లక్షణాన్నీ తెలియచేస్తున్నట్లుగా భావిస్తున్నారు. ఊరేగింపులు తీసిన సాధారణ పౌరుల్నీ, నాయకుల్నీ, వేతనం పెంచమని ఆందోళనకు దిగిన ఉద్యోగుల్నీ క్షణాలలో విచారించి శిక్షించగల న్యాయవ్యవస్థ ఆర్థిక, సాంఘిక, రాజకీయ శక్తుల్లో బలవంతుల్ని రక్షించేందుకు కోట గోడల వంటి చట్టసౌలభ్యాలను, రంధ్రాలను, సంప్రదాయాలను, ఉదార స్వభావ సూత్రాలనూ నెలకొల్పి రక్షిస్తోంది. న్యాయవ్యవస్థ పనితీరులో యిది అంతర్భాగమైపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టడమంటే, వందలాది ప్రజలను మట్టుపెట్టటానికి సమానమైన నేరమని న్యాయానికి తెలియదా! కల్తీలు, ప్రమాదకర ఆయుధాల తయారీలు, పెద్దఎత్తున లంచాలూ, వక్రీకరణలూ, పత్రాల మార్పులూ, నకిలీ సాక్ష్యాలూ ‘‘హత్యా నేరసదృశాలు’’కావా? వీటిని శిక్షించలేకపోగా వారు విడుదలయ్యేందుకు లక్ష నిష్క్రమణ మార్గాలు న్యాయవ్యవస్థ లేదా న్యాయచట్టం కల్పిస్తుంటే దేశానికి ముక్తి ఏమిటి? ‘‘కరణంగారి అబ్బాయి లెక్క తప్పుచేస్తే, లెట్టివాని కొడుకును కొట్టి అందరికీ పాఠం చెప్పే’’ పల్లెటూరి పంతులుగారిలా న్యాయవ్యవస్థ మారిపోతోంది! పేదలను, బలహీనులను శిక్షించి దేశానికి చూపిస్తున్న ‘ఉన్నత’ విలువలను, ‘ఉదాత్త’ సంప్రదాయాలను బలవంతుల ఎడల న్యాయవ్యవస్థ చూపించలేకపోతున్నది. ఇందుకు ప్రధాన కారణం.. ఎవరైనా, ఎక్కడ దాగున్నా, కనిపిస్తున్న ఫలితం, చట్టం తల్లి కళ్లను మూసి ‘త్రాసు’ను ఒకవైపుకు వంచేస్తున్నది!!!
-చందు సుబ్బారావు

చట్టం కలవాడి చుట్టం అన్నది నేటి సమాజంలో ప్రతి దినం ఋజువౌతున్న సత్యమే. చట్టాలు చేస్తున్న రాజ్యాంగ సభలన్నీ ఎవరితో నిండి ఉంటున్నాయి? ఇంచు మించు మొత్తంగా ఆ చట్టాలను ఉల్లంఘిస్తున్న ఘనులతోనే! మరి ఆ చట్టాలు తమ చట్రాన్ని ఛేదించిన నిందితులను చట్ట సభలలో ఎలా ఆశీనులయ్యే విధంగా అనుమతించ గలుగుతున్నాయి? ఈ విధమైన దుర్బలత నుంచి న్యాయ వ్యవస్థ ఎందుకు తప్పించుకోలేక పోతోంది? ఈ విధమైన దౌర్భాగ్యానికి న్యాయ సభల్లోకి రాజకీయ జోక్యపు నియామకాలూ, పదోన్నతుల జోక్యాలూ కూడా ప్రధాన కారణమే. చాలా సందర్భాలలో ప్రజలే రాబోయే తీర్పులను ముందే ఊహించ గలుగుతున్నారు, న్యాయం ఫలానా వేపే వుంటుంది అని మానసికంగా సిద్ధపడి రాజీ పడగలుగు తున్నారు.
ReplyDeleteమనలాంటి వారి వేదన రోదనలు చెవిటి వాడి ముందు శంఖం ఊదిన చందం తప్ప వినిపించుకుని, పట్టించుకునే ఓపికా, తీరికా, వివేచనా, ఎవరికీ ఏ వ్యవస్థకూ లేదు.
చట్టాలన్నీ ప్రజా శ్రేయస్సు అనబడే పంచదార పూసిన చేదు గుళికలే తప్ప సామాన్యుడికి మేలు కలిగించే ఔషధాల మాత్రలు మాత్రం కావు. చట్టాలు కేవలం రాజ్యాన్ని రక్షించే అస్త్రాలు తప్ప స్వరాజ్యాన్ని స్థాపించే శాస్త్రాలు మాత్రం కావు. ఖచ్చితంగా ...